Ration Distribution Updates : రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనాలి

Admin
By -
0

 Ration Distribution Updates: 

  

     రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనాలి
రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనాలి..........................

• ఎండీయూ వాహన సమాచారాన్ని కార్డుదారులకు చేర్చాలి

• కలెక్టర్ డాక్టర్ జి.సృజన

కర్నూలు(సెంట్రల్): ఎండీయూ వాహనాల రాకపోకల సమయాన్ని వలంటీర్లు ప్రజలకు తెలియజేయాలని, లేకపోతే జియోట్యాగింగ్ లోకేషనన్ను సర్చ్ చేసి సంబం ధిత వలంటీర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుం టామని కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు. గురువారం ఉదయం ఆమె జిల్లా అధికారులు, మండ లాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఎండీయూ వాహనాలు, ఆడు దాం ఆంధ్ర, రీసర్వేకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా చోట్ల రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
 ఈ క్రమంలో వలం టీర్లు రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉం టుందన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. మరోవైపు మూడో విడత రీసర్వేలో భాగంగా 160 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి కావడంతో స్టోన్ ప్లాంటేషన్పై దృష్టిసారించాలని రెవెన్యూ అధి కారులకు సూచించారు. ఆడుదాం-ఆంధ్ర క్రీడలకు సంబంధించి క్రీడాకారుల రిజిస్ట్రేషన్, గ్రూపుల ఏర్పా టు, ఆటస్థలాల గుర్తింపు, ఆటస్థలాల మ్యాపులు, షెడ్యూల్ తయారీ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కౌతాళం మండలం ఎంపీడీఓ పనితీ రుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 వారం రోజుల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడాకారుల రిజిస్ట్రేషన్లో కేవలం రెండు శాతమే పురోగతి కనిపించడపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ.......
ఎండీయూ వాహనాలు ఏ రోజు ఏ వీధిలో ఏ సమయంలో నిలుస్తాయో వలంటీర్లు  ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇందుకోసం వలంటీర్లకు నెలకు రూ.750 అదనంగా ఇచ్చేందుకు చర్యలు తీసు కుందన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి, హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి పాల్గొన్నారు. విజయవాడకు వెళ్లిన కలెక్టర్ సృజన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన గురువారం విజయవాడ వెళ్లారు. ఈ నెల 22,23వ తేదీల్లో అక్కడ ఎన్నికల సంఘం నిర్వహించే సన్నాహాక సమావేశంలో పాల్గొ ననున్నారు.

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)