ఆయుష్మాన్ భారత్తో రూ.5 లక్షలు ఆరోగ్య బీమా
సాక్షి, అమరావతి: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా ఏటా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తెలిపారు. ఈ పథకంలో చేరిన వారికి దేశంలో ఎం ప్యానల్ అయిన ప్రధానాస్పత్రుల్లో ఉచితం గా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కృ ష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పీఎం భారతీయ జన ఔషధీ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన మందులు, పీఎంఎంవీవై కింద కింద ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో మొదటి కాన్పునకు రూ.5 వేల పారితోషికం, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6 వేల పారితోషికం ఇస్తున్నట్లు వివరించారు.
Please Comment ......Thank You