udyam registration benefits in telugu

Admin
By -
0
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వలన కలిగే ప్రయోజనాలు

 


భారత ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ భాగం-11, విభాగం 3, ఉప విభాగం (ii) ప్రకారం ఆయా సంస్థలను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలుగా విభజించడానికి గాను వాటి పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ రెండింటిని సంయుక్త గుర్తింపుగా తేదీ 01.07.2020 నుండి పరిగణించాలని              26-06-2020 తేదీన నోటిఫై చేసారు.

ఈ క్రొత్త నిర్వచనం అమలుకు మరియు వ్యాపారం సులభతరం చేయడానికి గాను ఎం. ఎస్. ఎం. ఇ. లన్నియు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనబడే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ముఖ్యాంశాలు :

• వారి వారి సంస్థల కోసం, ఎవరైనా ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పొంద వచ్చును. దీని కోసం               https://udyamregistration.gov.in/Government-India/Ministry-MSME-registration.htm  అనే వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొనవచ్చును.

• ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితముగా డిజిటైజ్ చెయ్యబడింది. ఎలాంటి
పత్రాలు అప్ లోడ్ చెయ్యనవ సరం లేదు.

• రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎవరికీ ఎటువంటి సొమ్ములు చెల్లించనవసరం. లేదు.

• రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పేరు తో e-సర్టిఫికెట్
జారీ చేయబడుతుంది.

• ఆ సర్టిఫికేట్ పైన ఒక స్పష్టమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని సాయంతో మా వెబ్ సైట్ ద్వారా ఆ సంస్థకు సంబంధించిన వివరాలను పొంద వచ్చును .

• ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గాని, అప్ డేట్ చేసినప్పుడు గాని ఎవరైనా ఉద్దేశ పూర్వకముగా తప్పుడు వివరాలు ఇచ్చినా, స్వయం నిర్ధారిత విషయాలలో లేదా అంకెలలో తప్పులున్నా ఈ చట్టం, సెక్షన్ 27 ప్రకారము పెనాల్టీ విధించబడుతుంది.

• ఈ ఆన్లైన్ వ్యవస్థ ఇన్ కం టాక్స్, GSTIN (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ) వెబ్ సైట్లతో పూర్తిగా అనుసంధానింపబడి ఉంది. ఆయా సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల మరియు వార్షిక టర్నోవర్ల వివరాలు ప్రభుత్వ డేటాబేస్ నుండి వాటంతట అవే తీసుకోబడతాయి. వార్షిక టర్నోవర్ లెక్కింపులో ఎగుమతులను పరిగణించరు.

• ఇదివరకే ఇ.ఎం-II లేదా యుఏయమ్ రిజిస్ట్రేషన్ లేదా ఎం. ఎస్. ఎం. ఇ. మంత్రిత్వ శాఖకు లోబడి ఇతర విభాగ అధికారులు జారీ చేసిన ఎటువంటి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పటికీ, వారందరూ 31 -03 -2021 లోపల ఇక్కడ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంది .


• ఏ సంస్థ కైనా ఒకటికి మించి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు. అయితే ఆ సంస్థకు సంబంధించి ఉన్న అన్ని కార్యకలాపాలను అంటే ఉత్పత్తి లేదా సేవా లేదా రెండింటినీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్లో చూపించవచ్చును.


రిజిస్ట్రేషన్ కు అర్హతలు :


• రిజిస్ట్రేషన్ కోసం కేవలం ఆధార్ నెంబర్ సరిపోతుంది.


• తేదీ. 01-04-2021 తర్వాత పాన్ మరియు జి.ఎస్.టిన్ లను తప్పనిసరిగా కలిగి ఉండాలి.


రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు :


• ప్రతి పరిశ్రమ కు ఇది శాశ్వత గుర్తింపు మరియు మౌలిక గుర్తింపు సంఖ్య.


• ఎం. ఎస్. ఎం. ఇ. రిజిస్ట్రేషన్ కేవలం కాగిత రహితమే కాదు, స్వయం ప్రకటితం కూడా.


• ఈ రిజి స్ట్రేషన్ కు మళ్ళీ పునరుద్ధరణ అవసరం లేదు .


• సంస్థ చేసే ఎన్ని కార్యకలాపాలైనా ఉత్పత్తి మరియు సేవారంగం లేదా రెండింటినీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్ లో పొందుపర్చవచ్చును.


• ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్లతో పాటు, సంస్థలు తమను తాము జెమ్ (గవర్నమెంట్ ఐ- మార్కెట్ ప్లేస్) మరియు సమాధాన్ (ఆలస్యపు చెల్లింపుల పరిష్కరణకు ఉద్దేశించిన పోర్టల్ ) వెబ్ సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును . దానితో పాటు ట్రెడ్స్ (TRS) వేదికను కూడా పంచుకొనవచ్చును. దీనికి గాను 1 .www.invoicemart.com; 2.m1xchange.com; www.rxil.in వెబ్సైట్లను ఉపయోగించవచ్చును. 3


• క్రెడిట్ గ్యారంటీ స్కీం, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ప్రభుత్వ టెండర్లలో అదనపు సౌలభ్యం, ఆలస్యపు చెల్లింపుల నుంచి రక్షణ వంటి పలురకాల ఎం. ఎస్. ఎం. ఇ. మంత్రిత్వ శాఖ పథ కాలను అంద కోవడానికి ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడవచ్చును.


• బ్యాంకుల నుండి ప్రాధాన్యత విభాగపు రుణాలు పొందడానికి అర్హత పొందుతారు. 

ప్రాధాన్యతా రంగాలకు ఋణ సౌకర్యం:


సర్కులర్ నెంబర్: RBI/FIDD/2020-21/72 మాస్టర్ డైరెక్షన్స్ :FIDD.CO.Plan.BC.5/04.09.01/ 2020-21 తేదీ. సెప్టెంబర్ 04,2020 ద్వారా ప్రాధాన్యతా విభాగాల కొరకు రుణాల మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారము 

(i) వ్యవసాయం, 

(ii) సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు,

 (iii) ఎగుమతి రంగాలు, 

(iv) విద్య, (v) గృహాలు,

 (vi) సామాజిక మౌలిక సదుపాయాలు, 

(vii) పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ), 

(viii) ఇతర రంగాలు అనే విభాగాలపై రుణాలను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు. దీని వల్ల ఎం. ఎస్. ఎం. ఇ. రంగ పరిశ్రమలు ప్రాధాన్యతా విభాగపు రుణాల జాబితాలో కి వచ్చాయి. భారత ప్రభుత్వ గజిట్ నోటిఫికేషన్ నెంబర్ : S.O.2119(E) తేదీ. 26-06-2020, సర్కులర్ నెంబర్ : RBI/2020-2021/10FIDD.MSME& NFS.BC.No. 3/06.02.31/2020-21 తేదీ. 02-07-2020, తేదీ 21-08-2020 (కలిపి చదువు కోవలయును) ప్రకారము విడుదల చేసిన ఎం. ఎస్. ఎం. ఇ. ల నిర్వచనాలను పరిగణన లోనికి తీసుకొని సులభ రీతిలో ప్రాధాన్యతా రంగాలకు గాను రుణాల మంజూరీ మరియు ఈ విధానాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యాలను వినియోగించుకోవడానికి ఎం. ఎస్. ఎం. ఇ. లు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 1951 ను అనుసరించి ఏవిధంగా నైనా సరకులు ఉత్పత్తి చేయడములో గాని లేదా సేవారంగంలోనైనా నిమగ్నమై ఉండి ఉండాలి.


రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నిబంధనల మేరకు ఎం. ఎస్. ఎం. ఇ. లకు అన్ని బ్యాంకులు అందించే రుణాలు ప్రాధాన్యతా విభాగపు రుణాల నిబంధనలకు లోబడి ఉండాలి.

 

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)