యూపీఎస్ వద్దు..ఓపీఎస్ ముద్దు
ü
ఏకీకృత పెన్షన్
పథకాన్ని తిరస్కరిస్తున్న కార్మిక సంఘాలు
ü
ఉద్యోగుల భాగస్వామ్య
వాటా ఎందుకని నిలదీత
ü
సమస్యలు తప్పవని
హెచ్చరిక
ü
అనేక అంశాలపై స్పష్టత
లేదని పెదవి విరుపు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన
ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) పలు కార్మిక సంఘాలు తిరస్కరించాయి. రెండు దశాబ్దాల
క్రితం రద్దు చేసిన పాత పెన్షన్ పథకాన్నే (ఓపీఎస్) తిరిగి చేపట్టాలని డిమాండ్ చేశాయి.
కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తెర పైకి తెచ్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంస్థ ‘ది నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్’ విమర్శించింది.
న్యూఢిల్లీ : ‘ఓపీఎస్ కింద 20 సంవత్సరాల సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్ వచ్చేది. యూపీఎస్‌లో
దానిని పాతిక సంవత్సరాలు ఎందుకు చేశారు? మేము ఓపీఎస్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని మూవ్‌మెంట్ అధ్యక్షుడు విజరు కుమార్ బంధు స్పష్టం
చేశారు.
షేర్ మార్కెట్‌లో పెన్షన్ నిధులు : సీఐటీయూ
ఎన్‌పీఎస్ కంటే యూపీఎస్ మెరుగైనది
కావచ్చునని, కానీ అది కూడా భాగస్వామ్య పథకమేనని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
తెలిపారు. తాము ఓపీఎస్‌ను మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ‘మోడీ నేతృత్వంలోని
ఎన్డీఏ ప్రభుత్వం తన నయా ఉదారవాద ముసుగులో క్రోనీ క్యాపిటల్ ప్రయోజనాలను పరిరక్షిస్తోంది.
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం తన వాటాను మరో నాలుగున్నర శాతం పెంచింది. జూలై 31 నాటికి
ఎన్‌పీఎస్ కింద ఉన్న 99,77,165 మంది ఉద్యోగులకు చెందిన రూ.10,53,850 కోట్ల పెన్షన్
నిధులను షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికే ఇలా చేస్తోంది’ అని ఆయన మండిపడ్డారు. యూపీఎస్‌లో ప్రభుత్వ, ఉద్యోగుల
భాగస్వామ్య వాటాల మొత్తాన్ని వివిధ సంస్థల్లో పెట్టుబడి పెడతారని, అయితే వాటి నష్టాల
చరిత్ర ఎవరికీ తెలియదని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్
(డీటీఎఫ్) తెలిపింది.
వచ్చే వడ్డీ కంటే పెన్షన్ చెల్లింపులు ఎక్కువైతే…
‘ప్రస్తుత కార్పస్ నిధి నుండి
వచ్చే వడ్డీ కంటే ఏ సంవత్సరంలో అయినా పెన్షన్ చెల్లింపుల మొత్తం ఎక్కువగా ఉంటే అనేక
సమస్యలు వస్తాయి. అప్పుడు యూపీఎస్‌ను ఎంచుకున్న ఇన్-సర్వీస్ ఉద్యోగులు తమ వంతుగా
మరింత వాటాను అందించాల్సి ఉంటుంది. లేదా యూపీఎస్ కార్పస్ దెబ్బతింటుంది. అంటే ఈ రోజు
పెన్షన్ చెల్లించడానికి రేపటి పెన్షన్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. లేకుంటే యూపీఎస్
కార్పస్‌ను మరింత రిస్క్‌తో కూడిన కంపె నీల్లో పెట్టుబడులకు మళ్లించాల్సి ఉంటుంది.
ఫలితం గా మూలధనానికి నష్టం వాటిల్లుతుంది. అంటే యూపీఎస్ కార్పస్ తగ్గిపోతుంది. ఇవేవీ
కాకుంటే పెన్షన్‌దారులకు పెన్షన్, డీఏల చెల్లింపులో అసాధార ణ జాప్యం జరగవచ్చు. ఏది
జరిగినా ఉద్యోగులు, పెన్షనర్లకు నష్టమే’ అని డీటీఎఫ్ వివరించింది.
ఒరిగేదేముంది?
40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత
ఉద్యోగంలో చేరిన వారికి యూపీఎస్ వల్ల ఒరిగేదేమీ లేదని, ఎందుకంటే వారు పాతిక సంవత్సరాల
సర్వీసు పూర్తి చేసుకునే అవకాశమే ఉండదని ‘ది అకడమిక్స్ ఫర్ యాక్షన్ అండ్ డెవలప్‌మెంట్
టీచర్స్ అసోసియేషన్’ తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల్లో
ప్రవేశం పొందే వయసు సాధారణంగా ఎక్కువగా ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ టీచర్లు, ఉద్యోగుల
విషయంలో వారి సర్వీసు కాలం చాలా తక్కువగా ఉంటుందని చెప్పింది. యూపీఎస్‌ను వేతన సంఘంతో
అనుసంధానం చేస్తారా అనే దానిపై స్పష్టత లేదని అంటూ ఓపీఎస్ కింద పెన్షన్లను వేతన సంఘమే
సమీక్షించేదని గుర్తు చేసింది.
స్పష్టత అవసరం
కాగా యూపీఎస్‌ను ఆహానించే వారు
సైతం పథకం నిధికి ఉద్యోగి తన జీతంలో పది శాతాన్ని అందజేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నారు.
నూతన పథకం వివరాలపై స్పష్టత రావాల్సి ఉన్నదని కొన్ని కార్మిక సంఘాలు తెలిపాయి. పదవీ
విరమణ సమయంలో చెల్లించే మొత్తం, అదనపు పెన్షన్, ఆరోగ్య కార్డులు, భవిష్యత్తులో సవరణలు,
పన్ను ప్రయోజనాలు వంటి అంశాలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని వివరించాయి. ప్రభుత్వం,
ఉద్యోగుల మధ్య రాజీ కోసం ఏర్పడిన జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) కార్యదర్శి
శివ గోపాల్ మిశ్రా యూపీఎస్‌ను స్వాగతించారు. ఎన్‌పీఎస్ కింద 2004 జనవరి 1వ తేదీ తర్వాత
ఉద్యోగంలో చేరిన వారు, పదవీ విరమణ చేసిన వారు యూపీఎస్ ప్రయోజనాలకు అర్హులని ఆయన చెప్పారు.
సంఫ్‌ు పరివార్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఫ్‌ు కూడా యూపీఎస్‌పై హర్షం వ్యక్తం చేసింది.
మార్కెట్ గ్యాంబ్లింగ్ కొనసాగుతుంది
Please Comment ......Thank You