గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ లకు
ఆ శాఖ మార్గదర్శకాలు
సొంత గ్రామాల్లో పనిచేసేందుకు వీల్లేదు
» సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు
సచివాలయాల ఉద్యోగుల బదిలీ లకు ఆ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి
31 వరకు బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ పోర్టల్లో లాగిన్ అయి
బదిలీకి దర ఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, నియామక అథారిటీలు ఆయా ఖాళీలను
ప్రక టించాలని, సీనియారిటీ ప్రాతిపదిక కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. దీంతో
పాటు అపాయింట్మెంట్ అథారిటీ పాలనా సౌలభ్యం కోసం కూడా బదిలీలు చేయవ చ్చని పేర్కొన్నారు.
ఏసీబీ/విజిలెన్స్ తదితర కేసుల్లో ఉన్నవారు బదిలీకి దరఖాస్తు చేసుకు నేందుకు అనర్హులని
తెలిపారు. ఏ ఉద్యోగినీ కూడా సొంత గ్రామ పంచాయతీలో నియవి ంచరాదని, తప్పుడు సమాచారమిస్తే
వారిపై క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారని తెలిపారు.
ఐటీడీఏ పరిధిలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యమివ్వాలన్నారు.
కౌన్సిలింగ్కు హాజరుకాని ఉద్యో గుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరాదని గ్రామ, వార్డు
సచివాలయ శాఖ డైరక్టర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపారు.
Please Comment ......Thank You